చిత్తూరు జిల్లాలో ఇవాళ మరో పాజిటివ్ కేసు నమోదుకావటంతో... జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకూ నమోదైన పాజిటివ్ కేసులు సంఖ్య 74కి చేరుకుంది. మంగళవారం నమోదైన పాజిటివ్ కేసు సైతం... శ్రీకాళహస్తిలో గతంలో కరోనా పాజిటివ్‌గా నమోదైన వ్యక్తి కాంటాక్ట్‌గా అధికారులు గుర్తించారు. ఇప్పటివరకూ జిల్లాలోనే అత్యధికంగా శ్రీకాళహస్తిలో 44 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న శ్రీకాళహస్తి, తిరుపతిని అధికారులు పూర్తిగా రెడ్‌జోన్‌గా ప్రకటించి... ప్రతి ఆరుగంటలకు ఒకసారి పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నారు.
జిల్లాలో 74కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు - చిత్తూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల
చిత్తూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 74కు చేరింది. ఇవాళ మరో కేసు నమోదు కాగా... చికిత్స పూర్తి చేసుకొని మెుత్తం 16 మంది కరోనా ఆసుపత్రుల నుంచి డిశ్ఛార్జ్ అయ్యారు.
ఇప్పటి వరకూ జిల్లా వ్యాప్తంగా 16మంది కరోనా పాజిటివ్‌గా తేలిన వ్యక్తులు... చికిత్స పూర్తి చేసుకుని డిశ్ఛార్జ్ కాగా... యాక్టివ్ కేసులు సంఖ్య 58కి తగ్గింది. కరోనా పాజిటివ్ కేసులకు సంబంధించి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌ను గుర్తిస్తూ... వారిని క్వారంటైన్లకు తరలిస్తున్నారు. మరో వైపు రుయా ఆసుపత్రిలో ఓపీ సేవలను అధికారులు పునరుద్ధరించారు. కరోనా మినహా మిగిలిన వైద్యసేవలను రుయా నుంచి నేరుగా ప్రైవేటు ఆసుపత్రులకు రిఫర్ చేసి అక్కడ వైద్యసహాయాన్ని అందిస్తున్నారు. ఇందుకోసం ఆరోగ్యశ్రీ సదుపాయాన్ని వినియోగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా ఇప్పటికే ప్రకటించారు.