చిత్తూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు ఉద్ధృతమవుతోంది. జిల్లాలో ఒక రోజులోనే 1124 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ జిల్లాలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 38,841కి చేరింది. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 10 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 439 కి చేరింది. రాష్ట్రంలోనే అత్యధిక మరణాలు చిత్తూరు జిల్లాలోనే నమోదవటం.. మహమ్మారి విజృంభణను స్పష్టం చేస్తోంది. జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో ఇప్పటివరకు 29,008 మంది కరోనా మహమ్మారి నుంచి కొలుకోగా.. 9,394 మంది చికిత్స పొందుతున్నారు.
జిల్లాలో విజృంభిస్తున్న మహమ్మారి..ఒక్కరోజే 1124 కేసులు - చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు
ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ విజృంభిస్తోంది. చిత్తూరు జిల్లాలో తాజాగా 1124 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 38 వేల 841 కి చేరింది.
corona cases