చిత్తూరు జిల్లాలో కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకు కొవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. సోమవారం జిల్లాలో కొత్తగా 116 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటివరకూ జిల్లావ్యాప్తంగా కేసుల సంఖ్య 4వేల 763కు చేరాయి. సోమవారం మహమ్మారికి ఐదుగురు ప్రాణాలు కోల్పోగా... జిల్లాలో మొత్తం మృతుల సంఖ్య 51కి చేరుకుంది. వివిధ ఆస్పత్రుల్లో ఇప్పటివరకు 15వందల 80 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకోగా.. 3వేల 132 యాక్టివ్ కేసులకు జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు
జిల్లాలో కరోనా ఉద్ధృతి... తిరుపతిలో లాక్ డౌన్ - తిరుపతి కరోనా వార్తలు
జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 4వేల763కు చేరింది. సోమవారం జిల్లాలో కొత్తగా 116 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తిరుపతిలోనే ఎక్కువ కేసుల నమోదవుతుండటంతో అధికారులు లాక్ డౌన్ ప్రకటించారు.
జిల్లాలో కరోనా ఉద్ధృతి... తిరుపతి లాక్ డౌన్
ఒక్క తిరుపతిలోనే అధిక సంఖ్యలో నమోదవుతున్న కేసులను దృష్టిలో పెట్టుకున్న అధికారులు 14 రోజులపాటు నగరంలో లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. దుకాణాల నిర్వహణకు ఉదయం 6 నుంచి 11 గంటల వరకే అనుమతి ఇచ్చారు. అనంతరం రోడ్లపైకి వాహనాలు, ప్రజలను అనుమతించమని జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా తెలిపారు. తిరుమల బైపాస్ రోడ్ కి మాత్రం లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు.