చిత్తూరు జిల్లాలో కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకు పెరిగిపోతున్న కేసులు జిల్లాలో వైరస్ వ్యాప్తిని స్పష్టం చేస్తున్నాయి. శనివారం జిల్లాలో 343 పాజిటివ్ కేసులు నమోదు కాగా... వాటితో జిల్లాలో నమోదైన కేసుల సంఖ్య 4వేల మార్కును దాటింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకూ 4207 కేసులు నమోదుకాగా... 44మంది మృత్యువాత పడ్డారు.
జిల్లాలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి... 4వేలు దాటిన కేసులు - ap corona cases latest update
చిత్తూరు జిల్లా కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. శనివారం కొత్తగా 343కేసులు నమోదు కాగా...మొత్తం కేసుల సంఖ్య 4వేల 207కు చేరింది.
ఒక్క తిరుపతిలోనే కేసుల సంఖ్య 2వేల మార్కును దాటగా...శనివారం ఒక్క రోజే తిరుపతిలో 256 కేసులు నమోదయ్యాయి. జిల్లావ్యాప్తంగా నమోదవుతున్న కేసులను దృష్టిలో పెట్టుకుని అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుపతిలో విష్ణు నివాసం సైతం ఆదివారం నుంచి కొవిడ్ సెంటర్‌గా అందుబాటులోకి రానుంది. ఇక్కడ రెండు వేల మంది మైల్డ్ కేసుల రోగులకు చికిత్స అందించే ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా తెలిపారు. జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో ఇప్పటివరకు..1413 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకోగా.. 2750 యాక్టివ్ కేసులకు జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.