ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెండోరోజూ 200 మందికి పైగా పాజిటివ్‌ - చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు

చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా 200 మందికి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో 25 శాతం కేసులు తిరుపతిలోనే ఉన్నాయి. నగరి ఎమ్మెల్యే గన్​మెన్​కూ వైరస్ సోకింది.

corona
corona

By

Published : Jul 10, 2020, 10:10 AM IST

చిత్తూరు జిల్లాలో వరుసగా రెండోరోజు 200కి పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తిరుపతిలోనే ఎక్కువ మంది వైరస్‌ బారిన పడ్డారు. ఇప్పటి వరకు జిల్లాలో 2,643 మందిలో లక్షణాలు బయటపడ్డాయి. ఇందులో 25 శాతం కేసులు తిరుపతి నగరంలోనే వెలుగు చూశాయి. తిరుపతి నగరంలో 659 మందికి, తిరుపతి గ్రామీణంలో 147 మందికి కరోనా నిర్ధారణయింది. నగరి ఎమ్మెల్యే రోజా భద్రతా సిబ్బందిలో ఒకరికి వైరస్‌ సోకిందని అధికారులు తెలిపారు. గురువారం వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 236 కేసులు నమోదయ్యాయి. జిల్లా యంత్రాంగం ప్రకటించిన జాబితాలో వీటిని 227గా చూపారు. మదనపల్లె పట్టణంలో ఒకే కుటుంబంలో ముగ్గురికి పాజిటివ్‌గా తేలింది. పుత్తూరు, రామసముద్రం మండలాల్లో 76 ఏళ్ల వృద్ధులకు కొవిడ్‌ సోకింది.

రాత్రికి 71 కేసులు

గురువారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 71 కేసులు వచ్చాయి. తిరుపతి నగరం 30, పుత్తూరు 13, చిత్తూరు నగరం 7, నగరి 6, శ్రీకాళహస్తి 2, చిన్నగొట్టిగల్లు, కేవీపల్లె, కేవీబీపురం, మదనపల్లె, పాకాల, పలమనేరు, పెనుమూరు, వడమాలపేట, యర్రావారిపాళ్యం మండలాల్లో ఒక్కొక్కరు, ఇతర జిల్లా వాసులు నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణయింది. పలమనేరు పట్టణంలో కరోనా పాజిటివ్‌ కేసులు 18కి పెరిగాయని పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ మల్లికార్జున తెలిపారు.

వృద్ధుడి మృతి

నగరికి చెందిన 84 ఏళ్ల వృద్ధుడు బుధవారం రాత్రి కొవిడ్‌తో కన్నుమూశారని గురువారం అధికారులు తెలిపారు. తీవ్ర అనారోగ్యంగా బాధపడుతుండటంతో బుధవారం మధ్యాహ్నం తిరుపతి స్విమ్స్‌లో చేర్చారు. చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొవిడ్‌ పరీక్షల కోసం ముందుగానే నమూనాలు తీయగా.. గురువారం ఉదయం పాజిటివ్‌గా నిర్ధరణయింది. జిల్లాలో ఇప్పటివరకు కొవిడ్‌తో 17 మంది చనిపోయారు.

15 మంది డిశ్ఛార్జి

తిరుపతి కొవిడ్‌ ఆస్పత్రుల నుంచి 15 మంది కరోనా రోగులు గురువారం డిశ్ఛార్జి అయ్యారు. రాష్ట్ర కొవిడ్‌ ఆస్పత్రి (స్విమ్స్‌) నుంచి జిల్లాకు చెందిన ఆరుగురు, కృష్ణా జిల్లాకు చెందిన ఒకరు, వెస్ట్‌గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరితో కలపి మొత్తం తొమ్మిది మందిని ఇంటికి పంపారు. జిల్లా కొవిడ్‌ ఆస్పత్రి(రుయా) నుంచి జిల్లాకు చెందిన ఆరుగురికి డిశ్ఛార్జి సమ్మరీ అందజేసి పంపారు.

64 మండలాల్లో కంటైన్మెంట్‌ క్లస్టర్లు

జిల్లాలోని 64 మండలాల్లో కంటైన్మెంట్‌ క్లస్టర్ల జాబితాను కొవిడ్‌-19 జిల్లా నోడల్‌ అధికారి చంద్రమౌళి గురువారం ప్రకటించారు. తిరుపతి, చిత్తూరు నగరాల్లో అధిక పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటి పరిధిలో అధిక సంఖ్యలో కంటైన్మెంట్‌ జోన్లు ఉన్నాయి. నగరి, పుత్తూరు పురపాలక ప్రాంతాల్లోనూ కరోనా వ్యాప్తి అధికమవుతోంది. జిల్లాలోని గ్రామీణ మండలాల పరిధిలో ఏర్పేడు, సత్యవేడు, విజయపురం, తిరుపతి గ్రామీణ, రేణిగుంట, పుత్తూరు, నారాయణవనం, నిండ్ర, చంద్రగిరిలో కేసుల వ్యాప్తి ఎక్కువగా ఉంది. కంటైన్మెంట్‌ జోన్లలో పటిష్ఠ చర్యలు అమలు చేస్తున్నామని జిల్లా నోడల్‌ అధికారి చంద్రమౌళి స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

గ్యాంగ్​స్టర్ వికాస్ దూబే ఎన్​కౌంటర్

ABOUT THE AUTHOR

...view details