కరోనా మహమ్మారి మరోసారి చిత్తూరు జిల్లా వాసులను భయపెడుతోంది. రాష్ట్రంలో మరే జిల్లాలో నమోదుకాని రీతిలో చిత్తూరు జిల్లాలో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. గత ఏడాది కాలంలో 88,349 కేసులు నమోదవగా 857 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. అత్యధిక మరణాలతో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిన చిత్తూరు జిల్లా ... తాజాగా నమోదవుతున్న కేసులు కూడా అదే స్థాయిలో ఉండటంతో అధికారుల్లో అందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 2083 యాక్టివ్ కేసులలో 490 కేసులు జిల్లాలో ఉండటం స్థానిక పరిస్థితులకు అద్దం పడుతోంది.
పద్మావతి కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స
కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అప్రమత్తమైన అధికారులు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయడంతో పాటు.. అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేశారు. కరోనా పాజిటీవ్ ఉన్న వారిని హోం ఐసొలేషన్‌లో ఉంచి.. వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పద్మావతి కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స అందివ్వడానికి చర్యలు చేపట్టారు.