చిత్తూరు జిల్లాలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. శనివారం ఒక్కరోజే జిల్లాలో 949 పాజిటివ్ కేసులు నమోదు కాగా... జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకూ నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 11,327కి చేరింది. మహమ్మారి కారణంగా శనివారం ఆరుగురు ప్రాణాలు కోల్పోగా...జిల్లాలో కరోనా మృతుల సంఖ్య 114కి చేరుకుంది. ఒక్క తిరుపతిలోనే అధిక సంఖ్యలో నమోదవుతున్న కేసులను దృష్టిలో పెట్టుకుని... అధికారులు 14 రోజుల పాటు నగరంలో లాక్ డౌన్ విధించారు. దుకాణాల నిర్వహణకు ఉదయం 6 నుంచి 11 గంటల వరకే అనుమతిచ్చారు. 11 గంటల తర్వాత దుకాణాలను మూసి వేయడంతో పాటు.. రోడ్లపైకి వాహనాలను అనుమతించకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో ఇప్పటివరకు 6010 మంది కరోనా నుంచి కోలుకోగా, 5203 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
చిత్తూరులో కరోనా విజృంభణ... 11,327 మందికి సోకిన వైరస్ - covid-19 news
చిత్తూరు జిల్లాలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. శనివారం ఒక్కరోజే జిల్లాలో 949 పాజిటివ్ కేసులు నమోదు కాగా... జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకూ నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 11,327కి చేరింది.
చిత్తూరులో కరోనా విజృంభణ