కరోనా వైరస్ విస్తరణ రోజురోజుకీ పెరుగుతోంది. పట్టణాల్లో కేసుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో గడిచిన 24 గంటల్లో.. 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మండలంలోని అబ్భాబట్ల పల్లెలో ఒక కేసు నమోదు కావడంతో శ్రీకాళహస్తి మండలం పరిధిలో మొత్తం 11 కేసులు నమోదయ్యాయి.
మొదట్లో కరోనా కేసులు ఎక్కువగా వచ్చినప్పటికీ ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టాయి. కాగా తాజాగా 11 కేసులు రావటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.