ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 7, 2020, 4:09 AM IST

ETV Bharat / state

చిత్తూరు జిల్లాలోనూ పెరుగుతున్న కరోనా కేసులు

చిత్తూరు జిల్లాలో కరోనా పాజిటీవ్​ కేసుల సంఖ్య 17కు చేరింది. సోమవారం నాటికి 399మంది కరోనా అనుమానితులు నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించగా 314 నెగటీవ్​ వచ్చినట్లు కలెక్టర్ నారాయణ భరత్​ గుప్తా వెల్లడించారు.

coroan cases in chittoor dst corona cases
చిత్తూరులోనూ పెరుగుతున్న కరోనా కేసులు

చిత్తూరు జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 17 కు చేరింది. సోమవారం నాటికి 399 మంది కరోనా అనుమానితుల నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించగా 314 మందికి నెగిటివ్‌ వచ్చినట్లు జిల్లా కలెక్టర్‌ నారాయణభరత్‌ గుప్తా ప్రకటించారు.మరో 68 నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 15 క్వారంటైన్‌ కేంద్రాల్లో 589 మంది ఉన్నారన్నారు. సోమవారం రోజు పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదు. దిల్లీ, అస్సాం ప్రాంతాల్లో నిర్వహించిన మత ప్రార్థనలకు వెళ్లిన వారిలో 142 మందిని గుర్తించి క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉంచామని...పదిహేను మందికి సంబంధించి నెగిటివ్‌ రావడంతో క్వారంటైన్‌ కేంద్రాల నుంచి పంపేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. పాజిటివ్​గా నమోదైన వారిలో తిరుపతి నగరంలో ఐదుగురు, పలమనేరు, శ్రీకాళహస్తిలో ముగ్గురు చొప్పున ఉన్నారు. నగరి, రేణిగుంటలో ఇద్దరు చొప్పున నిండ్ర, ఏర్పేడులో ఒక్కొక్కరు చొప్పున కరోనా బాధితులు ఉన్నారని కలెక్టర్‌ ప్రకటించారు. పాజిటివ్‌ కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహించి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు సేకరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కరోనా అనుమానితుల నమూనాలు సేకరించడానికి వీలుగా నమూనా సేకరణ కేంద్రాలు ఐదు ఏర్పాటు చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details