తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు మూడు రోజుల పాటు వైభవంగా సాగాయి. వసంతోత్సవాల్లో ఆఖరి రోజున ఆలయంలోని ఆశీర్వచన మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. వేద పారాయణం, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలోనే అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు. మహా పూర్ణాహూతితో అమ్మవారి వసంతోత్సవాలను శాస్త్రోక్తంగా ముగించారు.
ముగిసిన తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు - thiruchanuru padmavati ammavaru
తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు మూడు రోజుల పాటు ఘనంగా జరిగాయి. ఆఖరి రోజున అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు.
ముగిసిన తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు