నిబంధనలకు విరుద్ధంగా తితిదే అనుబంధ ఆలయమైన కపిలతీర్థంలో... రుద్రయాగం నిర్వహించడంపై విమర్శలు వస్తున్నాయి. తితిదే పాలకమండలి సభ్యుడు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో అర్చకులు ఈ యాగం నిర్వహించారు. కార్తీకమాసం సందర్బంగా ఆలయంలో నెల రోజుల పాటు జరిగిన హోమ మహోత్సవాలు 3 రోజుల క్రితం ముగిశాయి. పాలకమండలి సభ్యుడు కృష్ణమూర్తి మామకు 70 సంవత్సరాలు పూర్తికావటంతో... ఆలయ వైదిక కార్యక్రమాలు నిర్వహించే యాగశాలలో ప్రైవేటు యాగం నిర్వహించడంపై... హిందూ ధార్మిక సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. యాగ మహోత్సవానికి తితిదే అనుమతి తీసుకొని నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. తితిదే అనుమతి సరైనది కాదని పలు హిందూ ధార్మిక సంస్థలు అభిప్రాయపడుతున్నాయి.
కపిలతీర్థంలో రుద్రయాగం... హిందూ ధార్మిక సంస్థల ఆగ్రహం - కపిలతీర్థంలో రుద్రయాగం
కపిలతీర్థంలో ఆలయ వైదిక కార్యక్రమాలు నిర్వహించే యాగశాలలో... ప్రైవేటు యాగం నిర్వహించడంపై హిందూ ధార్మిక సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పాలకమండలి సభ్యుడు కృష్ణమూర్తి మామకు 70 సంవత్సరాలు పూర్తికావటంతో... దీనిని జరిపినట్లు తెలుస్తోంది.
కపిలతీర్థంలో రుద్రయాగం