చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం లద్దిగం విద్యుత్తు సబ్ స్టేషన్లో విద్యుత్ స్తంభాలు ఎక్కి ఒప్పంద కార్మికులు ఆందోళన చేశారు. తమను ఉన్న ఫళంగా ఉద్యోగాల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు వచ్చి న్యాయం చేసే వరకు దిగి రామంటూ నిరసన వ్యక్తం చేశారు.
అధికారులు నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా... ఒప్పంద కార్మికులు ససేమిరా అన్నారు. ఫలితంగా చాలా సమయం పాటు లద్దిగం ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కరెంట్ సరఫరా లేక రైతులు, స్థానికులు ఇబ్బందిపడ్డారు. వారి డిమాండ్లను పైస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తామని సబ్ స్టేషన్ అధికారులు నచ్చ చెప్పగా... శాంతించిన కార్మికులు ఆందోళన విరమించారు.