రాష్ట్ర మత్రివర్గ సమావేశంలో సన్నిధి గొల్లల వంశపారపర్య వ్యవస్థను కొనసాగించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్నో ఎళ్ల నుంచి పోరాటం చేస్తున్న దానికి ప్రతిఫలం దక్కిందని శ్రీవారి ఆలయ సన్నిధి గొల్ల పద్మనాభ యాదవ్ ఆనందం వ్యక్తం చేశారు. మిరాశీ వ్యవస్థను కొనసాగించాలని పలు మార్లు యాదవులు పొరాటం చేశారు. చివరకు సీఎం జగన్ ఆ కోరిక నెరవేర్చారని... తిరుమలలో సన్నిధి గొల్లలు సంతోషించారు.
శ్రీవారి సన్నిధిలో గొల్లలు కొనసాగింపు - తిరుమల దేవస్థానం తాజా వార్తలు
శ్రీవారి ఆలయంలో విధులు నిర్వహించే సన్నిధి గొల్లలకు మిరాశీ వ్యవస్థను కొనసాగిస్తూ... రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వారంతా ఆనందం వ్యక్తం చేశారు.
శ్రీవారి సన్నిధిలోని గొల్లలు కొనసాగింపు