చిత్తూరు జిల్లా కె.వి పల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో విషాదం జరిగింది. గ్రామానికి చెందిన కృష్ణ అనే వ్యక్తి భవన నిర్మాణ కూలీగా జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే వెల్డింగ్ పనిచేస్తుండగా కరెంట్ షాక్కు గురయ్యాడు.
స్థానికులు వెంటనే కలకడ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.