పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చిత్తూరులో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల భారం మోపి పేద ప్రజల నడ్డి విరుస్తోందని ఆరోపించారు. కరోనా సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలపై ఈ భారం మోపడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వానికి ప్రజలే బుద్ది చెబుతారని చెప్పారు. అనంతరం కలెక్టర్ హరి నారాయణకు వినతి పత్రం అందజేశారు.
CONGRESS PROTEST: 'ప్రస్తుత సమయంలో ప్రజలపై భారం సరికాదు' - చిత్తూరు జిల్లా ప్రధాన వార్తలు
విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన చేపట్టింది. విద్యుత్ ఛార్జీల భారం మోపి ప్రభుత్వం పేద ప్రజల నడ్డి విరుస్తోందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్ ఆరోపించారు.
![CONGRESS PROTEST: 'ప్రస్తుత సమయంలో ప్రజలపై భారం సరికాదు' విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ నిరసన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13050325-428-13050325-1631527395188.jpg)
విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ నిరసన