ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పెంచిన ముడిచమురు ధరలు వెంటనే తగ్గించాలి' - చిత్తూరు జిల్లా నగరిలో కాంగ్రెస్ నాయకుల నిరసన వార్తలు

కేంద్ర ప్రభుత్వం పెంచిన ముడచమురు ధరలను తగ్గించాలని చిత్తూరు జిల్లా నగరిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నేతలు నిరసన చేపట్టారు.

fuel prices
fuel prices

By

Published : May 29, 2021, 10:36 PM IST

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని.. చిత్తూరు జిల్లా నగరిలో కాంగ్రెస్ నేత రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని.. మోదీ ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. గతంలో యూపీఏ ప్రభుత్వంలో అంతర్జాతీయ మార్కెట్​లో ముడి చమురు ధరలు 100 డాలర్లు పలుకుతున్నా.. మన దేశంలో రూ.50 నుంచి 60 రూపాయలు మధ్యనే పెట్రోల్ ధరలు ఉన్నాయని గుర్తు చేశారు.

ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ఒక బ్యారెల్ 68 డాలర్లలు పలుకుతున్నా.. మనదేశంలో లీటరు రూ.100 పైగా ధరలు పెంచడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. కరోనా కాలంలో చాలా మంది ప్రజలు ఉపాధి కోల్పోయి, ఆర్థిక సమస్యలతో పూట గడవడమే కష్టంగా మారిపోయిన వేళ.. కాస్తయినా ప్రజల మీద కనికరం లేకుండా 17 సార్లు పెట్రోల్,డీజిల్, గ్యాస్ ధరలను పెంచడం దారుణమని అన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details