రాష్ట్రంలో ఇసుక విషయంలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నా.. ముఖ్యమంత్రి జగన్ స్పందించడం లేదని కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ విమర్శించారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. డెంగీ జ్వరాలు, మరణాలతో ఆంధ్రప్రదేశ్... అనారోగ్యప్రదేశ్గా మారిందన్నారు. వీటిపై ప్రభుత్వం చర్యలేమీ తీసుకోవడం లేదని మండిపడ్డారు. అవిశ్రాంతంగా తిరుపతి అభివృద్ధి కోసం కృషిచేశానంటూ.. చిత్తూరు జిల్లా పార్టీ సమీక్ష సమావేశాల్లో తెదేపా అధినేత చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. చంద్రబాబు సీఎంగా ఉన్న 14 ఏళ్లలో తిరుపతిలో ఆయన చేసిన అభివృద్ధి శూన్యమంటూ ఎద్దేవా చేశారు. కేవలం కొన్ని సున్నితమైన అంశాలతోనే కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుందని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో భాజపా మళ్లీ అధికారంలోకి రావడం కలే అన్నారు.
'రాష్ట్రంలో అవినీతి లేదని చెప్పే ధైర్యం ఉందా..?' - తిరుపతిలో చింతా మోహన్ మీడియా సమావేశం వార్తలు
రాష్ట్రంలో ఇసుక విషయంలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నా.. ముఖ్యమంత్రి జగన్ స్పందించడం లేదని కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ విమర్శించారు. డెంగీ జ్వరాలు, మరణాలతో ఆంధ్రప్రదేశ్... అనారోగ్యప్రదేశ్గా మారిందన్నారు.
చింతా మోహన్