ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సంతకాన్ని ఫోర్జరీ చేయటమే కాకుండా.. ఎదురు నోటీసులు ఇస్తున్నారు' - చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఫోర్జరీ సంతకం తాజా వార్తలు

చిత్తూరు జిల్లా మదనపల్లెలో కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి మీనా కుమారి వైకాపా నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవాది అయిన తన సంతకాన్నే ఫోర్జరీ చేసి నామినేషన్ ఉపసంహరించటమే కాకుండా.. ఎదురు నోటీసులు పంపిస్తున్నారని ఆరోపించారు. దీనిపై డీఎస్పీ రవి మనోహరాచారికి ఫిర్యాదు లేఖను అందజేసినట్లు పేర్కొన్నారు.

congress councillor candidates fire on ysrcp
మదనపల్లెలో కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి మీనా కుమారి

By

Published : Mar 8, 2021, 11:21 AM IST


న్యాయవాది అయిన తన సంతకాన్నే ఫోర్జరీ చేసి నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు ప్రకటించడమే కాకుండా.. వైకాపా నాయకులు ఎదురు నోటీసులు పంపిస్తున్నారని.. చిత్తూరు జిల్లా మదనపల్లెలో కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి మీనా కుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషాతో కలిసి మదనపల్లి డీఎస్పీ రవి మనోహరాచారికి ఫిర్యాదు చేసిన ఆమె.. తన ప్రమేయం లేకుండానే తొమ్మిదో వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న తనను తొలగించినట్లు ఆరోపించారు.

రాజీకి రావాలని తొలుత వైకాపా నాయకులు కోరారన్న మీనాకుమారి.. ఒప్పుకో నందుకు తనకు లీగల్ నోటీసులు పంపించారంటూ వాపోయారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తన నామినేషన్ స్వీకరించేలా కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. వైకాపా ఎమ్మెల్యే నవాజ్ భాష అండతోనే.. స్థానిక నాయకులు ఈ ఆగడాలకు పాల్పడుతున్నారన్నారు. ఈ మేరకు డీఎస్పీ రవి మనోహరాచారికి ఫిర్యాదు లేఖను అందజేసినట్లు పేర్కొన్నారు.

ఇవీ చూడండి..

చిత్తూరులో 'ఫోర్జరీ' సంతకాలపై వ్యాజ్యం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details