చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో శ్రీ శైలం ఆలయ కమిటీ చైర్మన్ చక్రపాణిరెడ్డి , స్థానిక ఎమ్మెల్యే ఆర్.కే.రోజా వర్గీయుల మధ్య వర్గ విబేధాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఎంపీపీ ఎన్నికల సమయంలోనూ విబేధాలు రాగా.. అధిష్టానం చొరవ తీసుకొని ఇరువర్గాలు మధ్య సయోధ్య కుదిర్చి ఎమ్మెల్యే వర్గానికి ఎంపీపీ పదవి అప్పగించింది. అయినా ఇరు వర్గాల మధ్య వర్గ పోరు మాత్రం తగ్గలేదు. ఇటీవల జరిగిన జనాగ్రహ దీక్ష కార్యక్రమంలో జరిగిన పరిణామాలే దీనికి నిదర్శనం. చక్రపాణిరెడ్డి సమక్షంలో ఆయన స్వగ్రామమైన కొప్పేడులో, ఎంపీపీ దీప సమక్షంలో మండల కేంద్రం నిండ్రలో ఎమ్మెల్యే వర్గీయులు వేర్వేరుగా శిబిరాలు ఏర్పాటు చేసి దీక్ష చేపట్టారు.
అధికార పార్టీలో ఆ ఇద్దరి మధ్య విబేధాలు..! జనాగ్రహ దీక్షల్లో వేరు వేరు శిబిరాలు
ఎమ్మెల్యే రోజా, శ్రీశైలం ఆలయ కమిటీ ఛైర్మన్ వర్గీయుల మధ్య వర్గ విబేధాలు మరోసారి బయటపడ్డాయి. ఇటీవల వైకాపా జనాగ్రహ దీక్షల్లో వేరు వేరు శిబిరాలు ఏర్పాటు చేసి నిరసనల్లో పాల్గొన్నారు.
conflicts between mla roja and chakrapaani