ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Conflict : భూ తగాదాలతో ఘర్షణ... ఐదుగురికి తీవ్ర గాయాలు - crime news in chithore district

భూ వివాదం కారణంగా... చిత్తూరు జిల్లాలోని మిట్టూరు గ్రామంలో ఓ కుటుంబంపై దాడి(attack) జరిగింది. శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పికెటింగ్(picketing) ఏర్పాటు చేశారు.

conflict-with-land-issues-in-mitturu-chithore-district
భూ తగాదాలతో ఘర్షణ... ఐదుగురికి తీవ్ర గాయాలు

By

Published : Jun 27, 2021, 7:43 PM IST

చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలంలోని మిట్టూరు గ్రామానికి చెందిన గిరి నాయుడు, సునీల్ నాయుడు లకు సంబంధించిన భూమి ఒకే ప్రాంతంలో ఉంది. ఈ పొలంలో దారి కోసం ఐదు సంవత్సరాలుగా ఇరువురి మధ్య ఘర్షణ(Conflict)లు జరుగుతున్నాయి. ఈ ఘటనపై రామచంద్రాపురం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని గిరి నాయుడు తెలిపారు. శనివారం అర్ధరాత్రి సునీల్ నాయుడు వర్గీయులు తన ఇంట్లో చొరబడి కర్రలు, రాళ్లతో దాడి(attack)కి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో గాయపడిన ఐదుగురిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఇరు వర్గాల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. గ్రామంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పికెటింగ్(picketing) ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details