చిత్తూరు జిల్లా కుప్పంలో వైకాపా శ్రేణుల మధ్య ఘర్షణ తలెత్తింది. కుప్పంలో అంబేడ్కర్ వర్ధంతి సందర్బంగా వైకాపాకు చెందిన ఇరువర్గాలు గొడవపడ్డాయి. విగ్రహానికి పూలమాలలు వేసే విషయంలో నేతల మధ్య తలెత్తిన అభిప్రాయ భేదం... నాయకులు, కార్యకర్తల మధ్య బాహాబాహీకి కారణమైంది. సమాాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని అదుపు చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
కుప్పంలో అంబేడ్కర్ వర్ధంతి... వైకాపా శ్రేణుల మధ్య ఘర్షణ - కుప్పంలో వైకాపా శ్రేణుల ఘర్షణ
కుప్పంలో డా. బి.ఆర్ అంబేడ్కర్ వర్ధంతి కార్యక్రమంలో కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వైకాపాలోని రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి. బాహాబాహీకి దిగాయి. విగ్రహానికి పూలమాలలు వేసే విషయమే.. ఘర్షణకు కారణమైంది.
అంబేడ్కర్ వర్ధంతిలో అపశ్రుతి