ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నగరి వైకాపాలో విభేదాలు.. స్వతంత్ర అభ్యర్థికి చక్రపాణిరెడ్డి మద్దతు - conflict-between-two-groups-in-ycp-at-nagari

నగరి నియోజకవర్గంలో మరోమారు బయటపడిన వైకాపా విభేదాలు
నగరి నియోజకవర్గంలో మరోమారు బయటపడిన వైకాపా విభేదాలు

By

Published : Sep 25, 2021, 3:17 PM IST

Updated : Sep 25, 2021, 6:19 PM IST

15:13 September 25

వైకాపా ఇరువర్గాల ఒత్తిళ్లకు నలిగిపోతున్న అధికారులు

నగరి నియోజకవర్గంలో మరోమారు బయటపడిన వైకాపా విభేదాలు

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో మరోసారి వైకాపాలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి.  వైకాపాలో ఎమ్మెల్యే రోజా, శ్రీశైలం ట్రస్టు బోర్డు ఛైర్మన్​గా ఉన్న చక్రపాణిరెడ్డి వర్గం మధ్య చాలాకాలంగా విభేదాలు ఉన్నాయి. వీరి విభేదాల మధ్య అధికారులు ఒత్తిడికి గురవుతున్నారు. 

ఈ క్రమంలో నిండ్రలో మండల పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నిక కోసం రోజా, చక్రపాణిరెడ్డి వర్గాలు పోటీ పడ్డాయి. అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించడంతో రిటర్నింగ్ అధికారి కంటతడిపెట్టారు. తాము చెప్పినట్లే నడుచుకోవాలని అధికారులను బెదిరించారు. ఎంపీపీ ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థి భాస్కర్‌రెడ్డికి చక్రపాణిరెడ్డి మద్దతు ప్రకటించారు. వైకాపా నేతల తీరు పట్ల అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాల మధ్య నిండ్ర ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. 

ఇదీచదవండి.

Bharat Bandh: భారత్ బంద్​కు తెదేపా సంపూర్ణ మద్దతు: అచ్చెన్నాయుడు

Last Updated : Sep 25, 2021, 6:19 PM IST

ABOUT THE AUTHOR

...view details