ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సెల్​ఫోన్ కోసం కత్తులు, ఇనుప రాడ్లతో ఘర్షణ - చిత్తూరులో సెల్​ఫోన్ కోసం గొడవ వార్తలు

ఓ వర్గానికి చెందిన వ్యక్తి సెల్​ఫోన్ కొదవ పెట్టి డబ్బులు తీసుకున్నాడు. సెల్​ఫోన్ తీసుకున్న వ్యక్తి ఎక్కువ డబ్బులకు అమ్మేసుకున్నాడనే కారణంతో ఇరు వర్గాలు గొడవ పడ్డారు. కత్తులు, ఇనుప రాడ్లు ఉపయోగించి బుర్రలు బద్దలుకొట్టుకునే వరకూ తెచ్చుకున్నారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా రంగంపేటలో జరిగింది.

Conflict between the two groups for cell phone at rangampeta in chittoor
Conflict between the two groups for cell phone at rangampeta in chittoor

By

Published : May 8, 2020, 1:38 PM IST

చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం రంగంపేట ఎరుకుల కాలనీలో సెల్​ఫోన్ విషయమై రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఓ వర్గానికి చెందిన వ్యక్తి వద్ద ఫోన్​ని కొదవ పెడితే... ఎక్కువ డబ్బులకు అమ్మేసుకున్నారన్న కారణంగా మొదలైన గొడవ.. కత్తులు ఇనుపరాడ్లతో కొట్టుకునే వరకూ చేరింది. ఈ గొడవలో ఇరువర్గాలకు సంబంధించి తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని పూతలపట్టు ఎస్సై.. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. సంఘటనా స్థలాని చేరుకున్న పోలీసులు.. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పహారా కాస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details