చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం రాచగున్నేరి పంచాయతీలో ఒక ఓటు విషయమై.. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పోలింగ్ కేంద్రం ఎదుట అధికార పార్టీ మద్దతుదారులు, రెబల్ అభ్యర్థుల అనుచరులు గొడవ పడ్డారు. పంచాయతీ పరిధిలో నివసించని వ్యక్తులు... ఓటు ఎలా వేస్తారంటూ అధికార పార్టీ మద్దతు నాయకులు.. మరో వర్గం వారిని అడ్డుకున్నారు. పోలీసులు కలగజేసుకుని ఇరువర్గాల వారికి సర్దిచెప్పి గొడవ సద్దుమణిగేలా చేశారు.
రాచగున్నేరి పోలింగ్ కేంద్రం వద్ద ఇరువర్గాల మధ్య వాగ్వాదం - Conflict at Rachagunneri polling station news
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం రాచగున్నేరి పంచాయతీలో పోలింగ్ కేంద్రం వద్ద ఇరువర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. పోలీసులు కలగజేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
![రాచగున్నేరి పోలింగ్ కేంద్రం వద్ద ఇరువర్గాల మధ్య వాగ్వాదం Conflict between the two communities](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10714784-801-10714784-1613892188451.jpg)
ఇరువర్గాల మధ్య వాగ్వాదం