తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల పోలింగ్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 15వ డివిజన్లో వైకాపాకు సంబంధించిన మద్దతుదారులను మాత్రమే పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించారని తెదేపా కార్యకర్తలు నిరసనకు దిగారు. తమను పోలింగ్ కేంద్రంలోకి అనుమతించాలని కోరినా పోలీసులు నిరాకరించారని ఆందోళన వ్యక్తం చేశారు.
తిరుపతి పురపోరులో ఉద్రిక్తత.. పోలీసుల లాఠీఛార్జ్ - తిరుపతిలో వైకాపా, తెదేపా ఘర్షణ
తిరుపతి 15వ డివిజన్లో తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. వైకాపా మద్దతుదారులను.. పోలీసులు పోలింగ్ కేంద్రంలోకి అనుమతించారు. తమను అనుమతించట్లేదంటూ తెదేపా నాయకుల నిరసన వ్యక్తం చేశారు. వైకాపా, తెదేపా నేతల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు వారిని చెదరగొట్టడానికి.. లాఠీఛార్జి చేశారు.
conflict between tdp, ysrcp leaders in tirupathi municipal elections
ఈ నేపథ్యంలో పోలింగ్ కేంద్రం బయట తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. పోలింగ్ కేంద్రాల్లో ఉన్న వైకాపా కార్యకర్తలను బయటకు పంపాలని, లేకుంటే తమను పోలింగ్ కేంద్రంలోకి అనుమతించాలని తెదేపా నేతలు పట్టుపట్టడంతో ఉద్రిక్త పరిస్ధితి నెలకొంది.
ఇదీ చదవండి:ఉదయం 9 గంటలకు పోలింగ్ శాతం ఇలా..!