ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కూలీల కోసం రైతుల ఘర్షణ... నాటు తుపాకీ, కొడవళ్లతో దాడులు - చిత్తూరు జిల్లాలోని రామసముద్రంలో తుపాకి,కొడవళ్లతో దాడులు

ఇద్దరు రైతులు కూలీల విషయమై నాటు కొడవలి, తుపాకీతో దాడులు చేసుకున్నారు. ఈ వివాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా... ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. చిత్తూరు జిల్లాలోని రామసముద్రం మండలం బిక్కింవారిపల్లి జరిగిన ఘటన వివరాలివి..!

కూలీల కోసం రైతుల మధ్య ఘర్షణ
కూలీల కోసం రైతుల మధ్య ఘర్షణ

By

Published : Feb 2, 2020, 9:00 AM IST

కూలీల కోసం రైతుల మధ్య వివాదం

చిత్తూరు జిల్లాలోని రామసముద్రం మండలం బిక్కింవారిపల్లిలో శివప్ప, అంజప్ప అనే రైతుల మధ్య కూలీల విషయమై వివాదం నెలకొంది. ఈ ఘర్షణలో మాటా మాటా పెరిగి... నాటు కొడవలి, నాటు తుపాకీతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా... మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శివప్ప, అంజప్పలను అదుపులోకి తీసుకుని.. కొడవలి, నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details