ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TTD: శ్రీవారి దర్శనం టోకెన్లు ముందుగా ఎలా ఇచ్చారు? భక్తుల ఆగ్రహం - తిరుమలలో భక్తుల ఆందోళన

Concern of srivari devotees: శ్రీవారి సర్వ దర్శనం టోకెన్లను ముందస్తుగా ఇవ్వడంపై.. స్థానిక భక్తులు తీవ్రంగా తప్పుబట్టారు. ఇవాళ ఉదయం 9గంటల నుంచి టిక్కెట్లు జారీ చేస్తామని ప్రకటించిన తిరుమల తిరుపతి దేవస్థానం.. ముందు రోజు రాత్రే ఎలా కేటాయించిందని ప్రశ్నించారు. తితిదే ఉద్యోగులు అక్రమాలకు పాల్పడి.. సామాన్య భక్తులకు టికెట్లు లేకుండా చేశారని ఆరోపించారు.

Concern of srivari devotees
Concern of srivari devotees

By

Published : Jan 10, 2022, 4:59 PM IST

Concern of srivari devotees: భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఒకరోజు ముందే వైకుంఠద్వారం సర్వదర్శనం టోకెన్ల జారీని స్థానిక భక్తులు తీవ్రంగా తప్పుబట్టారు. ఇవాళ ఉదయం 9గంటల నుంచి టిక్కెట్లు జారీ చేస్తామని ప్రకటించిన తితిదే.. ముందు రోజు రాత్రే ఎలా కేటాయించిందని ప్రశ్నించారు.

తితిదే ఉద్యోగులు, ఇతరులు అక్రమాలకు పాల్పడి సామాన్య భక్తులకు టికెట్లు లేకుండా చేశారని ఆరోపించారు. భక్తుల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని టికెట్ల సంఖ్యను మరింత పెంచి.. విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:TTD EO On Vaikunta Ekadasi: వైకుంఠ ఏకాదశి.. ప్రముఖులు స్వయంగా వస్తేనే దర్శన టికెట్లు: తితిదే ఈవో

ABOUT THE AUTHOR

...view details