విదేశాల నుంచి వచ్చిన వ్యక్తుల ఆరోగ్యంపై ఆరా తీయటం దగ్గర నుంచి అనుమానిత వ్యక్తులను క్వారంటైన్లకు తరలించేలా....పక్కా ప్రణాళికలను రచిస్తున్నట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి తెలిపారు. సామాజిక మాధ్యమాల వేదికగా సున్నితమైన అంశాలపై అపోహలను ప్రచారం చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామంటున్న ఎస్పీ హెచ్చరించారు.
'తిరుపతిలో వచ్చిన పాజిటీవ్ కేసులపై పూర్తిస్థాయి దర్యాప్తు' - complete invetigation on tirupati corona positve cases
కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో...వైరస్ సంక్రమించేందుకు అవకాశం ఉన్న ఫస్ట్ కాంటాక్ట్, సెకండ్ కాంటాక్ట్ కేసులపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నామని తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లాలో పదిహేడు పాజిటివ్ కేసులు నమోదుకాగా తిరుపతి అర్బన్ పోలీస్ శాఖ పరిధిలోనే 11 కేసులున్నట్లు ఎస్పీ స్పష్టం చేశారు.
'తిరుపతిలో వచ్చిన పాజిటీవ్ కేసులపై పూర్తిస్థాయి దర్యాప్తు'