ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎమ్మెల్యేపై ఎస్ఈసీకి సర్పంచ్ అభ్యర్థి ఫిర్యాదు - chittor district news

చిత్తూరు జిల్లా మదనపల్లె, అంకిశెట్టిపల్లెకు చెందిన ప్రజలు.. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్​ను కలిశారు. పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని ఫిర్యాదు చేశారు.

Complaint to SEC against MLA Nawaz Basha
ఎమ్మెల్యే పై ఎస్ఈసీకి ఫిర్యాదు

By

Published : Feb 15, 2021, 7:30 PM IST

ఎమ్మెల్యే నవాజ్ బాషాపై ఎస్ఈసీకి మదనపల్లె, అంకిశెట్టి పల్లి వాసులు ఫిర్యాదు చేశారు. తిరుమల పద్మావతి అతిధి గృహంలో ఉన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్​ను అంకిశెట్టి పల్లి పంచాయతీ సర్పంచిగా పోటీ చేసిన వెంకటరమణ.. గ్రామస్థులతోపాటుగా వెళ్లి కలిశారు.

కౌంటింగ్ సమయంలో అక్రమాలు జరిగాయని ఫిర్యాదు చేశారు. తాను గెలిచినప్పటికీ... ఎమ్మెల్యే నవాజ్ బాషా ప్రమేయంతో.. తన ప్రత్యర్థి గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారని ఆయన ఆరోపించారు. బెదిరింపులకు సంబంధించిన వీడియోలను ఎస్ఈసీకి సమర్పించారు. తమకు న్యాయం చేయాలని ఎస్ఈసీకి కోరారు.

ABOUT THE AUTHOR

...view details