ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాల డెయిరీ గ్యాస్ లీకేజీ బాధితులకు పరిహారం అందజేత - పూతలపట్టు డెయిరీ గ్యాస్ లీకేజీ ఘటన

చిత్తూరు జిల్లా పూతలపట్టులోని పాల డెయిరీలో అమ్మోనియం గ్యాస్ లీకేజీ ఘటన బాధితులకు.. యాజమాన్యం ఆర్థిక సహాయం అందజేసింది. మొత్తం 14 మంది కార్మికులకు చెక్కులను అందించింది.

compensation gives to milk dairy gas leakage incident victims in puthalapattu chittore district
పాల డెయిరీ గ్యాస్ లీకేజీ బాధితులకు నష్టపరిహారం అందజేత

By

Published : Aug 26, 2020, 6:59 PM IST

చిత్తూరు జిల్లా పూతలపట్టులోని పాల డెయిరీలో అమ్మోనియం గ్యాస్ లీకేజీ ఘటన బాధితులను డెయిరీ యాజమాన్యం ఆర్థికంగా ఆదుకుంది. ఇందుకు సంబంధించిన చెక్కులను ఎమ్మెల్యే ఎంఎస్ బాబు చేతులమీదుగా అందజేశారు. ఈ ఘటన కారణంగా విషమ పరిస్థితుల్లో ఉన్న ముగ్గురికి ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు.. మరో 11 మంది కార్మికులకు తలా రూ. 2 లక్షలు అందించారు.

ఎమ్మెల్యే బాబు మాట్లాడుతూ.. గ్యాస్ లీకేజీ కారణంగా నష్టపోయిన కార్మికులను ఆదుకునేందుకు యాజమాన్యం ముందుకు రావడం సంతోషదాయకమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్మికులెవరూ ఆందోళన చెందవద్దని.. ప్రభుత్వం వారిని ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details