పెద్ద కుమారుడు చేసిన అప్పు ఆ కుటుంబాన్ని బలి తీసుకుంది. రూ. కోటిన్నరకు పైగా చేసిన అప్పు తీర్చకపోగా.. బాధ్యత లేకుండా ఎక్కడికో పారిపోయాడు. దాంతో అప్పు ఇచ్చిన వ్యక్తులు అప్పు తీర్చాలని ఆ కుటుంబంపై ఒత్తిడి చేశారు.. తల్లి, తండ్రి, మరో కుమారుడిని నిలదీశారు. తిట్లడమే కాకుండా.. శాపనార్థాలు పెట్టారు. అవమానం, బాధ, తలకు మించిన అప్పు తీర్చలేని నిస్సహాయత ఆ ముగ్గురిని కుంగదీసింది. తమకు చావే గతి అనుకుని.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. హృదయ విదారకమైన ఈ సంఘటన చిత్తూరు జిల్లా పుత్తూరు మండంలం రాచపాలెంలో జరిగింది.
SUICIDE: అప్పుల బాధ తట్టుకోలేక పురుగుల మందు తాగి.. - అప్పులు
06:44 August 26
కోటిన్నర అప్పు తీర్చలేక తమ్ముడు, తల్లిదండ్రులు బలవన్మరణం
మృతులు శంకరయ్య(55), గురవమ్మ(45), వినయ్(25)గా పోలీసులు గుర్తించారు. పెద్దకుమారుడు సతీష్(35) తెలిసిన వారి దగ్గర రూ. కోటిన్నర అప్పు చేశాడు. తిరిగి అడిగేసరికి పారిపోయాడు. అప్పులు ఇచ్చిన వారు కుటుంబాన్ని నిలదీయడంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగారు. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తీసుకువెళ్లాగా..అప్పటికే వారు చనిపోయారు.
పెద్ద కుమారుడు చేసిన అప్పులు చేసి తీర్చలేక పారిపోవడం వల్లే ఈ ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారని బంధువులు అంటున్నారు.
ఇదీ చదవండి:murder: నాటు తుపాకీతో అన్నను కాల్చి చంపిన తమ్ముడు