తిరుపతి నగరం ఇందిరానగర్‌లోని 1, 2 వార్డు సచివాలయాలను కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాలంటీర్లు తమకు కేటాయించిన ఇళ్ల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవాలన్నారు. కార్యదర్శులు, వాలంటీర్లు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రతి ఇంటికి తప్పనిసరిగా నీటి కుళాయి ఉండేలా చూడాలన్నారు. విధుల పట్ల అవగాహన పెంచుకుని ప్రజలకు ఉత్తమమైన సేవలు అందించాలన్నారు. అర్హులైన వారిని గుర్తించి సంక్షేమ పథకాలు అందేలా పని చేయాలన్నారు. ఒత్తిళ్లకు తలొగ్గి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. ఇందిరానగర్ కాలనీ వాసులతో కమిషనర్ నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నగరపాలక సంస్థ సిబ్బంది పనితీరు,మంచినీటి సరఫరా, పారిశుద్ధ్య కార్యక్రమాలపై నగరవాసులతో ఆరా తీశారు.
సచివాలయ సిబ్బంది బాధ్యతతో మెలగాలి - Tirupati Ward Secretariat News
సచివాలయ ఉద్యోగులు ప్రజల సమస్యలను తెలుసుకుని, వెంటనే పరిష్కరించాలని నగరపాలకసంస్థ కమిషనర్ గిరీషా ఆదేశించారు. తిరుపతి నగరంలోని ఇందిరానగర్ 1, 2 వార్డు సచివాలయాలను తనిఖీ చేసిన ఆయన సిబ్బంది బాధ్యతతో విధులు నిర్వహించాలని తెలిపారు.
ఇందిరానగర్ కాలనీ వాసులతో మాట్లాడుతున్న కమిషనర్