ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎస్వీబీసీ ఛైర్మన్​గా సినీనటుడు పృథ్వీరాజ్ - svbc chairmna

ఎస్వీబీసీ ఛైర్మన్​గా సినీనటుడు పృథ్వీరాజ్ నియమితులయ్యారు. శుక్రవారం జరిగిన బోర్డు సమావేశంలో సభ్యులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఛైర్మన్​గా ఈ నెల 28న  ఆయన  ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ఎస్వీబీసీ ఛైర్మన్​గా సినీనటుడు పృథ్వీరాజ్ నియామకం

By

Published : Jul 20, 2019, 5:37 AM IST

Updated : Jul 20, 2019, 7:31 AM IST

ఎస్వీబీసీ ఛైర్మన్​గా సినీనటుడు పృథ్వీరాజ్

శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఛైర్మన్​, డైరెక్టర్​గా సినీనటుడు బాలిరెడ్డి పృథ్వీరాజ్ నియమితులయ్యారు. శుక్రవారం తిరుపతిలో జరిగిన ఎస్వీబీసీ బోర్డు సమావేశంలో సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు. బోర్డు నిర్ణయం ప్రకారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన ఈ నెల 28న ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఛానల్ తొలి ఛైర్మన్​గా దర్శకుడు కె.రాఘవేంద్రరావు పనిచేశారు. ప్రభుత్వ మార్పుతో ఆయన రాజీనామా చేశారు.

బాలిరెడ్డి పృథ్వీరాజ్ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జన్మించారు. ఇ.వి.వి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన 'ఆ ఒక్కటీ అడక్కు'తో సినిమా రంగానికి పరిచయం అయ్యారు. పృథ్వీరాజ్ వైకాపా రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. గత సార్వత్రిక ఎన్నికల ఆ పార్టీ తరఫున ప్రచారం చేశారు.

ఇదీ చదవండి :జగన్​పై పవన్ విమర్శలకు.. పృథ్వీ కౌంటర్

Last Updated : Jul 20, 2019, 7:31 AM IST

ABOUT THE AUTHOR

...view details