చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పురపాలక సంఘంలో ఏర్పాటు చేసిన ప్రజా సేవల హెల్ప్ లైన్ కేంద్రాన్ని కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా పరిశీలించారు. పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా ఉన్నందున ప్రజలకు కావాల్సిన నిత్యావసర వస్తువులు గురించి తెలుసుకునేందుకు కార్యాలయంలో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. హెల్ప్‌లైన్ సెంటర్ పనితీరును కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సకాలంలో సమస్యలను పరష్కరించాలని అధికారులకు సూచించారు.
శ్రీకాళహస్తిలో హెల్ప్‌లైన్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ - శ్రీకాళహస్తిలో ప్రజా సేవల హెల్ప్‌లైన్ సందర్శించిన కలెక్టర్
ప్రజలకు కావాల్సిన వస్తువులు ఇళ్ల వద్దకు అందించేందుకు శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేసిన ప్రజా సేవల హెల్ప్‌లైన్ కేంద్రాన్ని కలెక్టర్ భరత్ గుప్తా సందర్శించారు. పట్టణంలో కరోనా కేసులు పెరిగిన నేపథ్యంలో ప్రజలకు కావాల్సిన నిత్యావసర వస్తువులు హెల్ప్‌లైన్ ద్వారా అందించేందుకు ఈ ఏర్పాటు చేశారు.
హెల్ప్‌లైన్ పనితీరును అధికారులను అడిగి తెలుసుకుంటున్న కలెక్టర్ భరత్ గుప్తా