విద్యార్థులు ఇష్టపడి చదవాలని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ విద్యార్థినీలకు పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా టీటీడీసీ కేంద్ర సమీపంలోని రాప్తాడు కస్తూరిబాయ్ విద్యాలయంలో కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యాలయంలోని డైనింగ్ హాల్, మరుగుదొడ్లను పరిశీలించారు. భోజన నాణ్యత వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. రోజువారి సరుకులకు సంబంధించిన హాజరు పట్టికను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. పలుసమస్యలను అడిగి తెలుసుకున్నారు. డా.బిఆర్ అంబేడ్కర్, జ్యోతిరావు పూలే, అలెగ్జాండర్, అరిస్టాటిల్, డా. ఏపీజె అబ్దుల్ కలామ్ గురించి వివరించారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని సమాజానికి ఉపయోగపడే విధంగా తయారు కావాలన్నారు. ఆలోచనలో ఉన్నతంగా ఉండాలని కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. కార్యక్రమానికి సర్వ శిక్ష అభియాన్ పీఓ రామచంద్రా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాప్తాడు కేబీవీలో కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ - Alexander
అనంతపురం జిల్లా టీటీడీసీ కేంద్ర సమీపంలోని రాప్తాడు కస్తూరిబాయ్ విద్యాలయం నందు ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ సత్యానారాయణ తనిఖీ నిర్వహించారు. పలుసమస్యల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
రాప్తాడు కస్తూరిబాయ్ విద్యాలయంలో కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ