చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పేదలకు పంపిణీ చేయనున్న ఇంటి స్థలాలను కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా, ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పరిశీలించారు. ఏర్పేడు మండలంలోని చిందేపల్లి సమీపంలో తిరుపతి నగరవాసులకు కేటాయించిన స్థలాన్ని సందర్శించారు. వీటికి రహదారి, తాగునీటి సౌకర్యం కల్పించేందుకు తీసుకోవలసిన ప్రణాళికల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పేదలకు ఉపయోగకరంగా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు... త్వరితగతిన చర్యలు చేపట్టాలని సూచించారు.
ఇళ్ల స్థలాలను పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యే - chitthoor district news today
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే పర్యటించారు. పేదల కోసం ప్రభుత్వం అందిస్తున్న ఇళ్ల స్థలాలను పరిశీలించారు. వాటిలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

ఇళ్ల స్థలాలను పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యే