తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో 10 కే.ఎల్ ఆక్సిజన్ ప్లాంట్‌ను చిత్తూరు కలెక్టర్ భరత్ గుప్తా ప్రారంభించారు. కొవిడ్‌తో పాటు సాధారణ రోగులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. 200 బెడ్లకు, 90 వెంటిలేటర్లకు ప్రాణవాయువును సరఫరా చేసే అవకాశం లభించిందన్నారు. ప్లాంట్‌తో పాటు సిలిండర్లూ అందుబాటులోకి వచ్చాయన్నారు. నిరుపేదలకు చికిత్స అందిస్తున్న ఈ వైద్యాలయానికి.. నిధులందించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
రుయాలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభించిన కలెక్టర్ - ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభించిన చిత్తూరు కలెక్టర్
రోగులకు అత్యవసర సమయాల్లో ప్రాణవాయువును అందించడానికి.. తిరుపతిలోని రుయాలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రాంరంభమైంది. అదనంగా మరికొంత మంది ప్రాణాలను కాపాడటానికి ఉపకరిస్తుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. సిలిండర్లూ అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.

ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభిస్తున్న కలెక్టర్
ఎస్వీ వైద్య కళాశాలను కలెక్టర్ సందర్శించారు. ఆన్లైన్ ద్వారా నిర్వహించిన క్విజ్‌లో గెలుపొందిన వైద్య విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్లు అందచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాధులపై పరిశోధన చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.
ఇదీ చదవండి:బీటెక్‌లో మూడేళ్ల తర్వాత డ్యుయల్ డిగ్రీకి అవకాశం: తిరుపతి ఐఐటీ డైరెక్టర్