తిరుపతిలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో బుధవారం మధ్యాహ్నం నగరపాలక సంస్థ లలిత కళాతోరణంలో జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. నగరపాలిక కమిషనర్ గిరీష, సంబంధిత అధికారులు, సిబ్బందికి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.
నేటి నుంచి ఆక్సో పల్స్ మీటర్ సర్వే నిర్వహించి ఆక్సిజన్ లెవల్స్ రీడింగ్ 95 లోపు ఉన్నవారిని గుర్తించాలని అందుకోసం ఏఎన్ఏంలకు అక్సో పల్స్ మీటర్లు అందిస్తున్నామని తెలిపారు. 95 కన్నా రీడింగ్ తక్కువగా ఉంటే రక్తంలో ఆక్సిజన్ తక్కువ ఉన్నట్లని, ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి వారిని అర్బన్ హెల్త్ సెంటర్కు పంపి పరీక్షలు నిర్వహించాలని సూచించారు.