ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవిడ్ కట్టడికి పటిష్ట చర్యలు : కలెక్టర్ భరత్ గుప్తా - చిత్తూరు కరోనా న్యూస్

కరోనా నివారణ చర్యలు పటిష్టంగా అమలుచేస్తున్నట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకూ 23 పాజిటివ్ కేసులు నమోదుకాగా, ఒకరు డిశ్చార్జి అయ్యారని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఆరు క్వారంటైన్ కేంద్రాలు అన్ని వసతులతో ఏర్పాటుచేశామని కలెక్టర్ పేర్కొన్నారు. లాక్​డౌన్ పొడిగింపుతో ప్రజలకు ఎటువంటి ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపట్టామని తెలిపారు.

Collector bharath gupta
కలెక్టర్ భరత్ గుప్తా

By

Published : Apr 14, 2020, 6:17 PM IST

జిల్లాలో కరోనా పరిస్థితిపై మాట్లాడుతున్న కలెక్టర్ భరత్ గుప్తా

చిత్తూరు జిల్లాలో కొవిడ్ 19 వైద్య సేవలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని కలెక్టర్‌ నారాయణ భరత్ గుప్తా అన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 23 కేసులు నమోదు కాగా ఒకరు డిశ్చార్జి అయ్యారని తెలిపారు. తిరుపతిలో మాట్లాడిన ఆయన.. జిల్లా వ్యాప్తంగా 6 క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటుచేశామన్నారు. శ్రీకాళహస్తిలో పాజిటివ్‌ వచ్చిన వారు గడచిన రెండు వారాలుగా క్వారెంటైన్ ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో పలమనేరు 3, శ్రీకాళహస్తి 5, ఏర్పేడు 1, తిరుపతి 6 , రేణిగుంట 2, నిండ్ర 1, నగరి 4 , వడమాల పేట 1 పాజిటివ్‌ కేసులు ఉన్నాయని కలెక్టర్‌ తెలిపారు. లాక్‌డౌన్‌ మే 3 వరకు కొనసాగిస్తామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు.

ABOUT THE AUTHOR

...view details