దేశ ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్ ఫిబ్రవరి 7న మదనపల్లికి రానున్నారు. ఈ పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా, ఎస్పీ సునీల్ కుమార్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేశారు. రాష్ట్రపతి హాజరుకానున్న సత్సంగ్ ఫౌండేషన్ కార్యాలయం పరిశీలించి.. ఫౌండేషన్ వ్యవస్థాపకులు ముంతాజ్ అలీతో చర్చించారు.
ఈ మేరకు పలు ప్రభుత్వ శాఖల అధికారులతో సబ్‌కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రపతి పర్యటన విజయవంతం అయ్యే విధంగా అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.