చిత్తూరు జిల్లా శాంతిపురం, కుప్పం మండలాల పరిధిలోని ప్రజలు.. ఇతర ప్రాంతాల్లోని భక్తుల మాదిరే మహా శివరాత్రి పూజలు శ్రద్ధగా నిర్వహిస్తుంటారు. కానీ.. శ్రీసిద్ధేశ్వరస్వామి వారి మెుక్కులు చెల్లించుకునేందుకు.. భక్తులు తలపై కొబ్బరికాయలు పగులగొట్టి ప్రత్యేక పూజలు చేశారు.
కదిరిముత్తునపల్లె, హనుమాన్ కోటాల గ్రామాల్లో దేవర ఎద్దుకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు.. ఆనవాయితీ ప్రకారం ఎద్దుతో పాటు భక్తుల తలపై కొబ్బరి కాయలను పగులగొట్టారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు గ్రామస్తులతో పాటు, భక్తుల కుటుంబీకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.