దేశంలో అన్లాక్ ప్రారంభంతో తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి వచ్చి విదేశీయులకు దర్శనం లేదు.. అన్న నిబంధనతో దర్శనం చేసుకోలేకపోయింది రష్యన్ మహిళ ఎస్తర్. దీంతో 10 రోజులుగా వేంకటేశ్వరుని దర్శనం కోసం ఎదురుచూస్తూ.. చేతిలో ఉన్న సొమ్ము మొత్తం ఖర్చు చేసుకుని కష్టాలు పడుతోంది. రష్యన్ మహిళ ఎస్తర్ దీనస్థితిపై ఈనాడు-ఈటీవీ భారత్ కథనాలపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వం తరపున, వ్యక్తిగతంగా రష్యన్ మహిళకు అవసరమైన సాయం అందించే బాధ్యతను ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డికి అప్పగించింది. దీంతో.. చెవిరెడ్డి ఆమె బస చేస్తున్న వసతి గృహానికి చేరుకొని ఎస్తర్తో చర్చించారు.
ఈటీవీ-భారత్ కథనానికి ప్రభుత్వం స్పందన.. రష్యా మహిళకు సాయం - రష్యా మహిళకు ప్రభుత్వం సాయం
రష్యా మహిళ ఎస్తర్పై ఈటీవీ భారత్-ఈనాడు కథనాలకు విశేష స్పందన వస్తోంది. కరోనా కారణంగా చిక్కుకుపోయిన ఆమెను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. రష్యా మహిళకు అవసరమైన సాయం అందించే బాధ్యతను ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పగించింది. దీంతో చెవిరెడ్డి.. ఆమె బస చేస్తున్న వసతి గృహానికి చేరుకొని ఎస్తర్ తో చర్చించారు. అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా రష్యా దేశం నుంచి ఫిబ్రవరి 6 న భారతదేశానికి వచ్చి కరోనా కారణంగా చేతిలో ఉన్న సొమ్ము అంతా ఖర్చుపెట్టుకొని అవస్థలు పడుతున్నట్లు తెలుసుకున్నారు. ఉత్తరప్రదేశ్ లో ఇరుక్కుపోయిన ఆమె తల్లి ఒలివియాను తిరుపతికి రప్పించడంతో పాటు.. వారు తిరిగి రష్యాకి చేరుకొనే వరకు అవసరమైన సాయం చేస్తామని చెవిరెడ్డి హామీ ఇచ్చారు. తమకు రష్యా వెళ్లే ఉద్దేశ్యం లేదని.. భారత దేశంలోనే ఉపాధి కల్పించాలని ఎస్తర్ కోరారు. తిరుపతిలో ఉన్నన్ని రోజులు ఉచిత బస, భోజనం సౌకర్యం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. తల్లితో కలిసి తిరుమలకి వెళ్లి శ్రీవారి దర్శనం కల్పించే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. రష్యన్ మహిళకు బద్వేల్ కు చెందిన ఓ గుత్తేదారు రూ. 15,500 ఆర్థిక సాయం అందించారు. ఇండియన్ ఫిజియోథెరపిస్ట్ అసోసియేషన్ తరపున కొంతసాయం అందించారు. పోలీస్ అధికారులు సాయం చేశారు. దేశ విదేశాల్లోని పలువురు సాయం చేస్తామని ముందుకొచ్చి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.
ఇదీచదవండి:ఈటీవీ-భారత్ కథనానికి విశేష స్పందన..రష్యా యువతికి ఆపన్న హస్తం