తిరుమల శ్రీవారి దర్శనానంతరం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ జపాలీ తీర్థాన్ని సందర్శించారు. కుటుంబ సమేతంగా పాపవినాశనం రహదారిలో ఉన్న జపాలీకి చేరుకున్న సీఎం.. అక్కడున్న ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హథీరాంజీ మఠం మహంతు అర్జుణ్‌దాస్.. శివరాజ్ సింగ్ చౌహాన్‌ను శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా స్వామివారి తీర్థప్రసాదాలను శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు అందజేశారు. అనంతరం అర్చకులు డాలర్ శేషాద్రిని కలిసిన సీఎం ఆశీర్వాదాలు తీసుకున్నారు.
తిరుమలలో ప్రకృతికి పరవశించిన మధ్యప్రదేశ్ సీఎం కొంతసేపు జపాలీ తీర్ధంలో కలయతిరిగారు. సతీమణి సాధన సింగ్, కుమారులు కార్తికీ చౌహాన్, కునాల్ చౌహాన్‌తో కలిసి అక్కడ పచ్చదనాన్ని ఆస్వాదించారు. ఉడతలకు, కోతులకు ఆహార పదార్థాలను అందించి ఉల్లాసంగా గడిపారు.