ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈ నెల 6న.. పుంగనూరు ఆర్టీసీ డిపోను వర్చువల్​గా ప్రారంభించనున్న సీఎం - సీఎం జగన్ వార్తలు

చిత్తూరు జిల్లా పుంగనూరులో నూతనంగా ఆర్టీసీ డిపోను నిర్మించారు. ముఖ్యమంత్రి జగన్.. ఈ నెల 6వ వర్చువల్ విధానంలో డిపోను ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను.. జిల్లా కలెక్టర్ హరినారాయణన్, పలువురు అధికారులతో కలిసి పరిశీలించారు.

punganur rtc cepot
punganur rtc cepot

By

Published : May 4, 2021, 9:11 PM IST

చిత్తూరు జిల్లా పుంగనూరులో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ డిపోను.. ఈ నెల 6న సీఎం జగన్ వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారని.. జిల్లా కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు. నూతన ఆర్టీసీ డిపోను మదనపల్లె సబ్ కలెక్టర్ జాహ్నవి, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ చెంగల్ రెడ్డితో కలిసి కలెక్టర్ పరిశీలించారు.

పుంగనూరులో ఏర్పాటు చేస్తున్న ఈ డిపో ద్వారా.. ఆరు మండలాల్లో.. 81 గ్రామాలకు 66 బస్సులు రానున్నాయని కలెక్టర్ తెలిపారు. కొవిడ్ నిబంధనలను అనుసరిస్తూ.. వర్చువల్ పద్దతిలో డిపో ప్రారంభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details