మోదీ, అమిత్‌షాలు సీబీఐ, ఈడీలను అడ్డంపెట్టుకొని బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని... సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. తిరుపతి సీపీఐ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మహరాష్ట్రలో రాజకీయాలు రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. కేసుల పేరుతో బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేసి... ఎన్సీసీ నేత అజిత్‌పవార్ మద్దతు ఇచ్చేలా చేశారని పేర్కొన్నారు.
'మాతృభాష తల్లిపాలు... ఆంగ్లభాష పోతపాలు' - మహారాష్ట్ర రాజకీయాలు లెటేస్ట్ న్యూస్
తిరుగులేని డిక్టేటర్‌గా మోదీ ఎదిగేందుకు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని... సీపీఐ నేత నారాయణ ఆరోపించారు. ఇదేతీరిలో జగన్ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. నవరత్నాల అమలుకు ప్రభుత్వ ఆస్తులను అమ్మాలనుకోవటం... ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేయడమేనని అభిప్రాయపడ్డారు. మాతృభాష తల్లిపాల లాంటిదని... ఆంగ్లభాష పోతపాల వంటివని అభివర్ణించారు.
రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసేరీతిలో ప్రభుత్వ విధానాలు ఉంటున్నాయని... నారాయణ అభిప్రాయపడ్డారు. సీఎం జగన్ అడుగులు రివర్స్ గేరులోనే ఉన్నాయని విమర్శించారు. సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వ భూములు అమ్మడం ద్వారా... ఆర్థిక వ్యవస్థ మందగిస్తుందని పేర్కొన్నారు. చంద్రబాబుపై కోపాన్ని అమరావతిపై చూపడం సరికాదని హితవు పలికారు. రాష్ట్రంలో ఆంగ్లమాధ్యమ బోధన నిర్ణయంపై ఆవేదన వ్యక్తం చేశారు. మాతృభాష తల్లిపాల లాంటిదని... ఆంగ్లభాష పోతపాల వంటిదని అభివర్ణించారు.