ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిత్తూరు జిల్లాకు సీఎం జగన్‌.. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ - శ్రీకాళహస్తిలో పేదలందరికీ ఇళ్లు పథకం ప్రారంభం వార్తలు

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పంపిణీని సీఎం జగన్ చేపట్టనున్నారు. శ్రీకాళహస్తి మండలం ఊరందూరులో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ, తొలివిడతలో నిర్మించనున్న ఇళ్ల పనులను ప్రారంభిస్తారు.

శ్రీకాళహస్తికి సీఎం జగన్.. పేదలందరికీ ఇళ్లు పథకం ప్రారంభం
శ్రీకాళహస్తికి సీఎం జగన్.. పేదలందరికీ ఇళ్లు పథకం ప్రారంభం

By

Published : Dec 28, 2020, 4:37 AM IST

Updated : Dec 28, 2020, 8:08 AM IST

చిత్తూరు జిల్లాకు సీఎం జగన్‌.. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ

చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా సీఎం జగన్ ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్​ లో బయలుదేరతారు. 11.20 గంటలకు ఊరందూరు చేరుకుని నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ, వైఎస్సార్‌ జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభిస్తారు. 167 ఎకరాల్లో రూపొందించిన వైఎస్సార్‌ జగనన్న కాలనీలో 6,232 ప్లాట్లలో 4,299 ప్లాట్లను పట్టణ పేదలకు కేటాయించగా 465 ప్లాట్లు శ్రీకాళహస్తి రూరల్‌, 1468 ప్లాట్లు ఏర్పేడు రూరల్‌కు చెందిన పేదలకు కేటాయించారు. తొలివిడత ఇళ్ల నిర్మాణంలో భాగంగా 5,548 మంది లబ్ధిదార్లకు ఇళ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం బహిరంగసభలో సీఎం ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2.50 గంటలకు ముఖ్యమంత్రి తిరిగి తాడేపల్లి చేరుకుంటారు.

Last Updated : Dec 28, 2020, 8:08 AM IST

ABOUT THE AUTHOR

...view details