చిత్తూరు జిల్లాలో కలకలం రేపిన చిన్నారి హత్య ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన చెప్పారు. వీలైనంత త్వరగా హంతకుడిని పట్టుకొని చట్టం ముందు నిలబెట్టాలని అన్నారు. ఇంతటి దారుణ హత్యకు పాల్పడిన వ్యక్తికి కఠినంగా శిక్ష పడేలా చూడాలని పోలీసులను సీఎం ఆదేశించారు. కురబలకోట మండలం అంగళ్లు పంచాయతీ చేనేతనగర్‌లోని కల్యాణ మండపం వద్ద చిన్నారి హత్యకు గురైన సంగతి తెలిసిందే.
చిత్తూరు జిల్లా ఘటనపై సీఎం స్పందన... దోషులను కఠినంగా శిక్షించాలని ఆదేశం
చిత్తూరు జిల్లాలో చిన్నారి హత్య ఘటనపై ముఖ్యమంత్రి జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. దారుణానికి పాల్పడిన వారిని గుర్తించి... కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు.
చిత్తూరు జిల్లా ఘటనపై సీఎం స్పందన... 'దోషులను కఠినంగా శిక్షించండి'
బి.కొత్తకోట మండలం గుట్టపాళ్యానికి చెందిన రైతు సిద్ధారెడ్డి.. బంధువుల పెళ్లి కోసం కుటుంబ సభ్యులతో కలిసి కురబలకోట వచ్చారు. అందరూ పెళ్లి మండపంలో ఉండగా.. గుర్తు తెలియని వ్యక్తులు చిన్నారిని అపహరించి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
పై వార్త మరిన్ని వివరాల కోసం-కొన్ని గంటల్లో శుభకార్యం... అంతలోనే విషాదం