తిరుపతి లోక్సభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో తొలిసారిగా ముఖ్యమంత్రి జగన్... వైకాపా ప్రచారంలో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా... ఈ నెల 14న రేణిగుంట యోగానంద ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. గత సాధారణ ఎన్నికలకు ముందు ఇదే ప్రాంతంలో సమర శంఖారావం నిర్వహించిన సీఎం... ఇప్పుడు సైతం అక్కడే భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి.
ఈ నెల 14న తిరుపతిలో వైకాపా బహిరంగ సభ... హాజరుకానున్న సీఎం - thirupathi latest news
తిరుపతి ఉప ఎన్నికల్లో భారీ ఆధిక్యంతో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న వైకాపా అందుకు అనుగుణంగా ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటి వరకు పది మందికి పైగా మంత్రులకు బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి జగన్... నేరుగా తానే ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని నిర్ణయించారు.
ఈ నెల 14న తిరుపతిలో భారీ బహిరంగ సభ