ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చంద్రగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మూసివేత

చంద్రగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పదిహేను రోజుల పాటు మూత పడింది. సిబ్బందికి కరోనా సోకిన కారణంగా.. అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

closure-of-chandragiri-sub-registrars-office-due-to-kovid
చంద్రగిరి సబ్ రిజిస్టర్ కార్యాలయం మూసివేత

By

Published : Sep 22, 2020, 1:31 PM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అధికారితోపాటు సిబ్బందికి కరోనా సోకింది. ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు కార్యాలయం మూతపడింది. కార్యాలయ సిబ్బంది, అధికారులు కరోనా పరీక్షలు చేయించుకోగా.... వారిలో ముగ్గురికి పాజిటివ్ వచ్చింది.

అప్రమత్తమైన అధికారులు పదిహేను రోజులపాటు కార్యాలయానికి సెలవు ప్రకటించి మూసేశారు. కార్యాలయ ఆవరణలో అంతా శానిటైజ్ చేసి బ్లీచింగ్ చల్లారు. మండల ప్రజలు సహకరించాలని రిజిస్ట్రార్ ప్రవీణ్ కుమార్ కోరారు.

ABOUT THE AUTHOR

...view details