ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుప్పంలో తెదేపా - వైకాపా శ్రేణుల బాహాబాహీ - పరిషత్ ఎన్నికలపై హైకోర్టు స్టే వార్తలు

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండల కేంద్రంలో తెదేపా-వైకాపా శ్రేణులు బాహాబాహీకి దిగాయి. పరిషత్ ఎన్నికలపై హైకోర్టు స్టే ఇవ్వడంపై ఈ వివాదం చేలరేగింది.

పరిషత్ ఎన్నికలపై హైకోర్టు స్టే.. కుప్పంలో తెదేపా-వైకాపా వర్గాల ఘర్షణ
పరిషత్ ఎన్నికలపై హైకోర్టు స్టే.. కుప్పంలో తెదేపా-వైకాపా వర్గాల ఘర్షణ

By

Published : Apr 6, 2021, 11:03 PM IST

పరిషత్ ఎన్నికలపై హైకోర్టు స్టే.. కుప్పంలో తెదేపా-వైకాపా వర్గాల ఘర్షణ

పరిషత్ ఎన్నికలపై హైకోర్టు స్టే ఇవ్వడంపై.. శాంతిపురం మండల కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసేందుకు తెదేపా నాయకులు చేరుకున్నారు. అదే సమయంలో వైకాపా ప్రచార రథం అక్కడికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది.

వాగ్వాదంగా మొదలైన ఘటనలో.. ఇరువర్గాలు దాడులకు దిగాయి. ఘర్షణలో తెదేపా నాయకుడు ఉయ్యాల జయరాం రెడ్డికి గాయాలు కాగా ఆయనను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details